Jangaon: మంత్రి పొంగులేటి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

Jangaon: ఈ నెల 26న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జనగామ జిల్లా పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.

MD AHMAD PASHA, JANGAON
Published on: 25 Sept 2026 2:46 PM IST
Jangaon
X

Jangaon: మంత్రి పొంగులేటి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

జనగామ జిల్లా: రాష్ట్ర గృహ నిర్మాణం రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల 26వ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టే ఏర్పాట్లపై శుక్రవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌ లతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి పర్యటనలో జనగామ మున్సిపాలిటీకి చెందిన 16 చెత్త సేకరణ నూతన ఆటోలకు జెండా ఊపి ప్రారంభించడం, మున్సిపల్ డంపింగ్ యార్డ్ షెడ్, మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ఎస్‌టీపీ తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు, 174 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం, 500 ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ, ప్రజా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

మునిసిపల్ కార్యాలయం ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్‌లో నిర్వహించే ప్రజా సమావేశానికి అన్ని ఏర్పాట్లు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

వేదిక పందిళ్లు బ్యాక్‌డ్రాప్ సౌండ్ సిస్టమ్ ఎల్ఈడీ వీడియో వాల్స్ విద్యుత్ సరఫరా జనరేటర్లు ఎయిర్ కండిషనింగ్ తాగునీరు పారిశుద్ధ్యం వైద్య సదుపాయాలు అగ్నిమాపక ఏర్పాట్లు పార్కింగ్ బారికేడింగ్ మీడియా ఎన్‌క్లోజర్ హెల్ప్‌డెస్క్ గ్రీన్ రూమ్, రవాణా దిశా నిర్దేశక బోర్డులు తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం మండలాల వారీగా సీటింగ్ బ్లాకులు, కౌంటర్లు ఏర్పాటు చేయాలని, తహసీల్దార్లు ఎంపీడీవోలు ఎంపీవోలు సమన్వయంతో లబ్ధిదారులను టోకెన్ల ఆధారంగా తీసుకువచ్చి, క్రమశిక్షణతో పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

మొత్తం కార్యక్రమ సమన్వయం ప్రోటోకాల్ ఏర్పాట్లను ఆర్డీఓ పర్యవేక్షించాలన్నారు.

మునిసిపల్ కార్యాలయంలో అలాగే వేదిక పరిసరాల్లో పారిశుద్ధ్యం తాగునీరు మరుగుదొడ్లు, పరిశుభ్రత చర్యలు మున్సిపల్ కమిషనర్ చేపట్టాలన్నారు.

నిరంతర విద్యుత్ సరఫరా జనరేటర్ బ్యాకప్ లైటింగ్ ఏర్పాట్లను విద్యుత్ శాఖ అధికారి పూర్తి చేయాలన్నారు. అలాగే భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

వేదికకు వెళ్లే రహదారులు బ్యారికేడ్లు మార్గ సూచిక బోర్డులు ఏర్పాటు, వేదిక వద్ద అగ్నిమాపక, వైద్య బృందాలు అంబులెన్స్ తాగునీటి సదుపాయం, అత్యవసర సేవలు సిద్ధంగా ఉంచాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి, మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.

అదే విధంగా డీసీపీ మాట్లాడుతూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రత్యేక డైవర్షన్‌లు అమలు చేయడం వీఐపీ అధికారులు మీడియా ప్రజల కోసం వేర్వేరు పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.

సభా ప్రాంగణంలో అవసరమైన చోట్ల బారికేడింగ్ ఏర్పాటు చేసి, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలను ప్రత్యేకంగా గుర్తించి జనసందోహ నియంత్రణకు తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్డీఓ గోపీరాం ఏసీపీ భీమ్ శర్మ, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు ఇతర సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON