Jangaon: వెల్లివిరిసిన మత సామరస్యం: విజయ గణపతి కమిటీ బతుకమ్మ
Jangaon: జనగామ 28వ వార్డులో శ్రీ విజయ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు మత సామరస్య వేదికగా ఘనంగా జరిగాయి.
Jangaon: వెల్లివిరిసిన మత సామరస్యం: విజయ గణపతి కమిటీ బతుకమ్మ
Jangaon: తెలంగాణ సాంస్కృతిక సంబురం బతుకమ్మ వేడుకలు జనగామ పట్టణంలోని 28వ వార్డులో శనివారం రోజు బతుకమ్మ పండగ సంబరాలు అంబరాన్నంటాయి శ్రీ విజయ గణపతి ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో కాలనీ మహిళలు ఏకమై బతుకమ్మ ఆడారు.
రంగురంగుల ప్రకృతి పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలను కాలనీ మధ్యలో ప్రతిష్టించి, మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ లయబద్ధమైన చప్పట్లతో జానపద గీతాలు ఆలపించారు.
ఉత్సవ కమిటి ప్రతినిధులు కాలనీ వాసులతో కలిసి సంబరాల్లో పాలుపంచుకోవడంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని, ఇటువంటి పండుగలను ఉత్సాహంగా జరుపుకోవడం మతసామరస్యానికి నిదర్శనమని కొనియాడారు.
వేడుకల అనంతరం బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో స్థానిక జలాశయంలో నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకోగా, కమిటీ ఆధ్వర్యంలో హాజరైన భక్తులకు తీపి ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో శ్రీ విజయ గణపతి ఉత్సవ కమిటి ముఖ్య, వార్డ్ ,కాలనీ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




