Yellareddypet: సర్పంచ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు, విచారణకు ఆదేశాలు!

Yellareddypet: ఎల్లారెడ్డిపేట సర్పంచ్ జేసీబీతో సీసీ రోడ్డును ధ్వంసం చేశారని కలెక్టర్ గరిమ అగర్వాల్‌కు నవీన్ రెడ్డి ఫిర్యాదు. పూర్తి విచారణకు ఆదేశించిన కలెక్టర్.

KALEEM, SIRICILLA
Updated on: 6 Sept 2026 3:04 PM IST
Yellareddypet
X

Yellareddypet: సర్పంచ్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు, విచారణకు ఆదేశాలు!

Yellareddypet: ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలగందుల నర్సింలు గ్రామపంచాయతీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు కామారెడ్డి నవీన్ రెడ్డి తెలిపారు.

నవీన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సుమారు ఐదు నెలల క్రితం రెండో బైపాస్ రోడ్డులోని తన ఇంటి నుంచి రెండో బైపాస్ రోడ్డు వరకు సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. అయితే గత నెల 2వ తేదీన ఆదివారం సెలవు దినం కావడంతో పాటు, అదే రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సర్పంచ్ ఎలాంటి సిబ్బందిని వెంట తీసుకురాకుండా జేసీబీ యంత్రం సహాయంతో నిర్మించిన సీసీ రోడ్డును ధ్వంసం చేశారని ఆరోపించారు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పరిషత్ అధికారి, గ్రామపంచాయతీ కార్యదర్శికి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

గ్రామ అభివృద్ధి కోసం నిర్మించాల్సిన సీసీ రోడ్డును ధ్వంసం చేయడం వెనుక కారణాలను విచారించాలని, ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్డును నష్టం చేయడంపై బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నవీన్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు.

అయితే సీసీ రోడ్డు ధ్వంసం చేసినట్లు వచ్చిన ఆరోపణలపై సర్పంచ్ ఎలగందుల నర్సింలు వివరణ తెలియాల్సి ఉంది. అధికారుల క్షేత్రస్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story