Hanamkonda: పీఎంశ్రీ స్కూళ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ చాహత్

Hanamkonda: హనుమకొండ జిల్లాలోని 19 పీఎంశ్రీ పాఠశాలల్లో కేటాయించిన నిధులతో అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ఆదేశించారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 15 Sept 2026 8:53 PM IST
Hanamkonda
X

Hanamkonda: పీఎంశ్రీ స్కూళ్ల పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ చాహత్

హనుమకొండ జిల్లా: జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.

మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని 19 పీఎంశ్రీ పాఠశాలల్లో ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30వ తేదీ వరకు విడుదలైన నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా పాఠశాలలకు విడుదలైన నిధులు, ఇప్పటివరకు చేసిన ఖర్చు, వివిధ ఇంటర్వెన్షన్ల కింద చేపట్టిన పనుల వివరాలను ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ పీఎం శ్రీ పాఠశాలల్లో ఆయా ఇంటర్వెన్షన్ల కింద కేటాయించిన నిధులను అభివృద్ధి పనులకు నిర్ణీత గడువులోగా వినియోగించాలన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడకూడా అలసత్వం ప్రదర్శించవద్దని సూచించారు.

ప్రతి ఇంటర్వెన్షన్‌కు కేటాయించిన బడ్జెట్‌ను సరైన సమయంలో వినియోగించడంతో పాటు, చేపట్టిన పనులు, చేసిన ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదికలను సమర్పించాలని పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో విద్యా శాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ మన్మోహన్, కమ్యూనిటీ మొబైలైజింగ్ కోఆర్డినేటర్ సుమాదేవి, లింగ సమానత్వ కోఆర్డినేటర్ సునీత, పీఎంశ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.