Hanumakonda: తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్
Hanumakonda: హనుమకొండ జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, లీకేజీలు అరికట్టి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు.
Hanumakonda: తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు: కలెక్టర్
Hanumakonda: జిల్లాలో ఎక్కడ కూడా రానున్న రోజుల్లో దాహార్తి సమస్య తలెత్తకుండా ముందస్తుగానే పకడ్బందీ చర్యలు తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు.
ఎల్ నీనో ప్రభావ పరిస్థితులను ఎదురుకునేందుకు వివిధ శాఖల అధికారులు చేపట్టాలిసిన చర్యల మీద సోమవారం కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మున్సిపల్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఇరిగేషన్ అధికారులు జిల్లా లో ఉన్న ట్యాంక్ లలో ఉన్న నీటి సామర్ధ్య వివరాలను తెలియజేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..... ఎల్ నీనో ప్రభావం వల్ల
తక్కువ వర్షపాతం నమోదు కావడం, భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉన్నందున.. రానున్న రోజుల్లో ప్రతి నివాస ప్రాంతానికి సరిపడేలా రక్షిత మంచినీరు సరఫరా అయ్యే విధంగా అధికారులు ఇప్పటి నుండే ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలన్నారు.
తాగునీటి సరఫరా తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో క్రమం తప్పకుండా ప్రతీ గ్రామ పంచాయతీ లో, వార్డ్ లలో పర్యవేక్షించాలన్నారు. నీటి వృధాకు ఆస్కారం లేకుండా, అందుబాటులో ఉన్న నీటి వనరులు పూర్తిస్థాయిలో సద్వినియోగం అయ్యేలా గ్రామ,మండల, జిల్లా అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు.
వాటార్ సప్ప్లె అవుతున్న సమయం లో లీకేజ్ లు ఏమైనా ఉన్నాయా అని గుర్తించాలన్నారు. ప్రతీ నెల మీటింగ్ పెట్టుకొని ఎల్ నీనో వల్ల ఏర్పడే సమస్య ల పైన కార్యాచరణ రూపొందించుకొని వాటిని ఎదుర్కొనేందుకు క్షేత్ర స్థాయి లో తగు చర్యలు తీసుకోవలన్నారు.
ప్రతీ నీటి బొట్టు సద్వినియోగం అయ్యేలా పర్యవేక్షణ చేయాలన్నారు. పైప్ లైన్ లలో , కార్ వాష్ సర్వీస్ లలో తదితర ప్రాంతాలలో నీటి వృధా ను అరికట్టాలన్నారు.
అనంతరం ఎంపీడీఓ లను ఉద్దేశిస్తూ కలెక్టర్ మాట్లాడుతూ...
ఇందిరమ్మ ఇళ్ల కు సంబందించి వచ్చిన అప్లికేషన్ లను క్షేత్ర స్థాయి లో త్వరగా వెరిఫికేషన్ పూర్తి అవ్వాలన్నారు. వీబీ-జీ రామ్ జీ లో భాగం గా గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన జాబ్ కార్డ్ దారులు అందరికీ విధిగా ఉపాధి కల్పించాలని, కూలీలు ఎక్కువ సంఖ్యలో పనులకు వచ్చేలా ఎంపీడీఓ లు (టర్నోవర్ పెరిగేలా) పర్యవేక్షణ చేయాలన్నారు.
ఈ సమావేశం లో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ వెంకన్న, స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, DMHO, ఎంపీడీఓ లు పాల్గొన్నారు.




