Hanamkonda: కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ!

Hanamkonda: హనుమకొండలో ఆర్ట్స్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ. ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు.

M PRABHAKAR, PARAKAL
Published on: 28 Sept 2026 5:46 PM IST
Hanamkonda
X

Hanamkonda: కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ర్యాలీ!

Hanamkonda: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలికి వ్యతిరేకంగా ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత, నిష్పక్షపాత విధానం అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్‌ను డిస్మిస్ చేసి, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒంటేరు శ్రవణ్ కుమార్, సమన్వయ కమిటీ సభ్యులు సోద రామకృష్ణ, కౌన్సిలర్లు బండి శ్రీధర్, సుధమల్ల రమేష్, కొయ్యడ శ్రీనివాస్, బొచ్చు సాల్మన్, డీసీసీ కార్యదర్శులు పాడి కల్పనాదేవి, ఎండి జాఫర్ రీజ్వి, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి, మహిళా నాయకురాలు లక్కం వసంత, కాంగ్రెస్ నాయకులు ఆయిలిపెళ్లి స్వామి, దొమ్మటి బాబురావు, ఎండి ఆలి, మడికొండ సంపత్ తదితరులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL