Mahabubabad: కాంగ్రెస్ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసిన కొమ్మలు నాయక్!

Mahabubabad: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, జిల్లా మాజీ కార్యదర్శి కొమ్మలు నాయక్ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి

B NARASIMHA, GUDUR
Published on: 1 July 2026 4:35 PM IST
Mahabubabad
X

Mahabubabad: కాంగ్రెస్ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసిన కొమ్మలు నాయక్!

మహబూబాబాద్ జిల్లా: గూడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా మాజీ కార్యదర్శి కొమ్మలు నాయక్ జన్మదిన వేడుకలు బుధవారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా గూడూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో కొమ్మలు నాయక్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు సర్పంచ్ సునీత కొమ్మలు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు.

ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కొమ్మలు నాయక్‌కు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు నాయకులు కొనియాడారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR

Next Story