Garla: గార్లలో జీవో 98 రద్దు, కరువు మండలంగా ప్రకటించాలని నిరసనలు!
Garla: మహబూబాబాద్ జిల్లా గార్లలో జీవో 98 రద్దు, నాణ్యమైన విద్యుత్ మరియు గార్లను కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ సీపీఐ, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
Garla: గార్లలో జీవో 98 రద్దు, కరువు మండలంగా ప్రకటించాలని నిరసనలు!
Garla: గార్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌కు సంబంధించిన 98 జీవో రద్దు, నాణ్యమైన విద్యుత్ సరఫరా కోరుతూ CPI పార్టీ , మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి విపత్తు నిర్వహణ ఎదురు మంజూరు చేయాలని CPM పార్టీ, రెండు పార్టీలు వేరు వేరు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర నేత కట్టబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యుత్ సరఫరా కోరుతూ, మున్నేరు–పాలేరు లింక్ కెనాల్‌పై జారీ చేసిన 98 జీవోను రద్దు చేయాలని, ఏజెన్సీ రైతాంగానికి నష్టం కలిగించవద్దని కోరుతూ ధర్నా నిర్వహించామని ,
ఎల్ నినో వాతావరణ ప్రభావం కారణంగా కొద్దో గొప్పో వేసిన పంటలకు త్రీఫేస్ విద్యుత్ పంపిణీ లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్.
పంటలకు నాణ్యమైన విద్యుత్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా అందించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ రైతాంగానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రజావాణి అధికారి, ఎంపీడీవో మంగమ్మకు అందజేశామన్నారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కందునూరి శ్రీనివాస్ ,మండల కార్యదర్శి అలవాల సత్యవతి మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావంతో గార్ల ఏజెన్సీ మండలంలో పంటలు పండని పరిస్థితి ఉందని వెంటనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి వెంటనే విపత్తు నిర్వహణ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు, MPDO కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి,గ్రీవెన్స్ లో అధికారులకు వినతి పత్రం అందజేశారు.
కరువు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 20 వేల రూ,ల చొప్పున పరిహారాన్ని చెల్లించి,రైతుల పంట రుణాలను రీ-షెడ్యూలు చేసి,తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలకు విత్తనాలను ఉచితంగా పంపిణీ చేయాలని,పశువులకు మేత,తాగునీరు కొరత కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా పశుగ్రాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని,వ్యవసాయ పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఉపాధి హామీ పథకం కింద అదనపు పని దినాలు కల్పించి,వ్య.కా,స కూలీలకు ఇస్తామన్న 12వేల రూ, ఇవ్వాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో CPI,CPM పార్టీ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.




