Hanumakonda: సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి.. పోలీసులతో భారీ తోపులాట, పెరిగిన ధరలపై ఆగ్రహం!
Hanumakonda: పెరిగిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలకు వ్యతిరేకంగా సీపీఐ ఆధ్వర్యంలో వరంగల్, హనుమకొండ కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తంగా మారింది.
పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ చేపట్టిన ఆందోళన కార్యక్రమం తీవ్ర ఉధృక్తతకు దారితీసింది. ఒక్కసారిగా నిరసన తెలుపుతూ ఉన్న ఆందోళనకారులు కలెక్టరెట్ లోకి దూసుకుపోయ్యారు.
తక్షణమే పేర్కొన్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు దాంతో పోలీసులకి , సీపీఐ నేతలకు మధ్య తోపులాట టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది.
నిత్యవసర వస్తువుల ధరలను పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ వరంగల్, హనుమకొండ జిల్లా శాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ బృందం పోలీసులను తోసుకొని కలెక్టరేట్లోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించగా పోలీసులకు సిపిఐ నాయకులకు మధ్య వాగ్విద్వాదం చోటుచేసుకుంది. జాతీయస్థాయిలో యుద్ధ వాతావరణం వల్ల ముడి చమురు రేట్లు పెరిగాయని సాకు చూపిస్తూ నిత్యవసరద వస్తువుల ధరలు పెంచితే పేదవారి జీవనం ఎలా కొనసాగాలని ప్రశ్నించారు. వంట గ్యాస్ తో పాటు కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన చిన్న చిన్న వ్యాపారస్తులు ఉపాధి కోల్పోయి రోడ్డుమీద పడుతున్నారని
తక్కలపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర సరుకుల ధరలు ఇలాగే కొనసాగితే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.




