Mahabubabad: హోరెత్తిన సీపీఎం 'జైల్ భరో': తహసీల్దార్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై 'జైల్ భరో' ర్యాలీ, ధర్నా నిర్వహించారు.

A.Rajkumar, Mahabubabad
Published on: 10 Aug 2026 10:06 PM IST
Mahabubabad
X

Mahabubabad: హోరెత్తిన సీపీఎం 'జైల్ భరో': తహసీల్దార్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత!

మహబూబాబాద్: కేంద్రం లో మోడీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో సి.పి.ఎం , సి.ఐ.టి.యు ల అధ్వర్యం లో కార్మికులు, కర్షకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ భారీ ర్యాలీ నిర్వహించి , తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న పలువురు సిపిఎం , సి.ఐ.టి.యు నాయకులు , కార్యకర్తలను పోలీసులు అదుపు లోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలంటూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. అదుపులోకి తీసుకున్న వారి పై కేసులు నమోదు చేసుకున్న అనంతరం పోలీసులు వారిని విడుదల చేశారు. క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి సాధుల శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్రం లో మోధీ 3 వ సారి అధికారం లోకి వచ్చామనే ధీమాతో రైతు , కార్మిక , శ్రామికులకు వ్యతిరేకంగా అనేక నల్ల చట్టాలను తీసుకవచ్చారని, ఉపాధి హామీ పథకాన్ని పేరుమార్చి వీ.బీ.జి.రామ్.జీ గా పేరు మార్చడం తో పాటు కేంద్రం 60 శాతం , రాష్ట్ర 40 శాతం నిధులను భరించాల్సి రావడంతో మునుముందు ఈ పథకాన్ని ఎత్తివేస్తారని , దీంతో నిరుపేద కూలీలకు ఉపాధి దొరకని పరిస్థితి ఏర్పడుతుందని , కేంద్రం వెంటనే నల్ల చట్టాలను రద్దుచేయిని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story