Jangaon: తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర వక్రీకరణ..బీజేపీపై సీపీఎం తీవ్ర విమర్శలు!
Jangaon: జనగామ జిల్లా పాలకుర్తిలో సీపీఎం సమావేశం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని మండిపాటు. ఈనెల 15న వీరవనితల స్ఫూర్తి యాత్ర.
Jangaon: తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర వక్రీకరణ..బీజేపీపై సీపీఎం తీవ్ర విమర్శలు!
Jangaon: వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి మత ఘర్షణలు చరిత్రగా చిత్రీకరించడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య పిలుపునిచ్చారు.
సోమవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ స్మారక భవనంలో సిపిఎం మండల కమిటీ నిర్వహించారు. ఈ సమావేశానికి ముస్కు ఇంద్రారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ దొరలు భూస్వాముల దోపిడి వెట్టి చాకిరికి వ్యతిరేఖంగా పేదలు రైతులు, కూలీలు ఐక్యంగా సాధించిన పోరాటమే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని పేర్కొన్నారు. ఆనాడు స్వేచ్ఛ వాయు పీల్చుకోలేని పరిస్థితుల్లో దొపిడికి వ్యతిరేకంగా అణిచివేతకు వ్యతిరేకంగా జాగిందర్ జమిందార్ విధానాన్ని వ్యతిరేకిస్తూ దున్నేవాడికి భూమి కావాలని ఎర్రజెండా పిలుపునిచ్చిందని ఆనాటి పిలుపుని అందుకొని నేటి వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూపోరాటాలు నిర్వహిస్తుందన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి నాయకులు ఈ పోరాటాన్ని హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరిస్తుందని విమర్శించారు, ప్రజల హక్కులు భూమికోసం సాగిన పోరాటాన్ని మతపరమైన కోణంలోకి లాగడం చరిత్రను వక్రీకరించడమే అన్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు గడుస్తున్న నీటికి నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో విఫలమైందన్నారు.
సాయుధ పోరాటం అంటేనే పాలకుర్తి ప్రాంతం గుర్తుకు వస్తుందని, జనగామ ప్రాంతం వీరుల పుట్టినిల్లు అని వారు కొనియాడారు. ఈనెల 15న పాలకుర్తి లోని వీరనారి ఐలమ్మ విగ్రహం ఎదుట వీరవనితల స్ఫూర్తి యాత్ర ప్రారంభమవుతుందని ఈ ప్రారంభ యాత్రకు ఐద్వా జాతీయ కార్యదర్శి కానినిక గోష్ గారుజాతీయ ఉపాధ్యక్షురాలు ఎస్ పుణ్యవతి గారు రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని మహిళలు పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సోమసత్యం, మాసంపల్లి నాగయ్య,ఏదునూరి మదార్, బెల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.




