Jangaon: ఇందిరమ్మ, 2BHK లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేంతవరకు పోరాటం: సీపీఎం!

Jangaon: జనగామలో సీపీఎం ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన ఇందిరమ్మ, 2BHK ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలివ్వాలని డిమాండ్ కలెక్టర్ సమయం ఇవ్వకపోవడంతో అంబేద్కర్ విగ్రహానికి వినతి.

MD AHMAD PASHA, JANGAON
Published on: 29 Sept 2026 7:10 PM IST
Jangaon
X

Jangaon: ఇందిరమ్మ, 2BHK లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేంతవరకు పోరాటం: సీపీఎం!

జనగామ: జనగామ పట్టణంలో 2012 -13 సంవత్సరంలో ఇల్లు లేని పేదలను గుర్తించి 1144 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి మౌలిక వసతులు గృహ రుణాలు ఇవ్వకుండా విస్మరించిన కారణంగా పేదలు ఇల్లు కట్టుకోలేకపోయారని ఆ స్థలాల్లో వారు శక్తి మేరకు నిర్మించుకున్న ఇండ్లకు ఇంటి నెంబర్లు అలాగే డబల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం స్థలం ఇచ్చిన ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్న 72 మంది పేదలకు వారి ఇండ్లను వారికే ఇవ్వాలని జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మంగళవారం రోజున సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జనగామ చౌరస్తా లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి మంగళవారం కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీగా వచ్చి నల్ల జండాలతో నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ ధర్నాకు సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల స్థలాలను గుంజుకొని డబల్ బెడ్ రూములు కట్టాలని నాటి ప్రభుత్వం పాలకులు బల ప్రయోగానికి పూనుకుంటే పేదలు కోర్టుకు వెళ్లి పేదల నిర్మించుకున్న ఇండ్ల స్థలాలను ఇండ్లను బలవంతంగా తీసుకోవద్దని చట్ట ప్రకారం నడుచుకోవాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిందని తెలిపారు.

జనగామ జిల్లా కలెక్టర్ మంగళవారం జనగామ చౌరస్తాలో నల్ల జండాలతో మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారులు కలెక్టర్ గారికి మెమోరాండం ఇద్దామని పోతే టైం ఇవ్వలేదు కాబట్టి జనగామ చౌరస్తాలో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారికి ఇచ్చి నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపాం ఇప్పటికైనా మూడో విడత లబ్ధిదారులతో మిమ్మలను తీసుకోకపోతే రేపటినుండి జనగామ జిల్లా వ్యాప్తంగా దశల వారి ఉద్యమాన్ని చేపడతామని వారు అన్నారు.

తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అక్కడ ఇళ్లన్నీ పూర్తి చేసి వారికి వీరికి అందరికీ పట్టాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని అన్నారు 2019 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ ఆర్డిఓ తహసిల్దార్ పేదల వద్దకు వచ్చి వారితో మాట్లాడి ఇండ్లు లేని వారికి స్థలాలు ఇస్తామని చెప్పి లేఅవుట్వేసి ఇచ్చారని అలాగే ఆర్థిక స్తోమత లేక ఇల్లు కట్టుకోలేని వారికి 72 మందికి డబల్ బెడ్ రూములు ఇస్తూ 2023 జూలై మాసంలో ఆనాటి తహసిల్దార్ డిప్యూటీ తాసిల్దారులు జిల్లా కలెక్టర్ ఆదేశంతో డ్రా తీసి వారికి ఇండ్లకి కేటాయించారు.

రెండు మూడు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రజలు అక్కడ వారి శక్తి మేరకు ఇల్లు కట్టుకున్నారని ఇ ఆ ఇండ్లకు ఇంటి నెంబర్లు వేసి కనీస సౌకర్యాలు కరెంటు మంచినీరు కల్పించాలని పేదలు ఎనిమిది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నప్పటికీ పట్టించుకోకపోవడం దారుణం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతా వీరికి ఇందిరమ్మ ఇండ్ల రుణాలు మంజూరు చేయకుండా పక్కా గృహాలు కట్టించకుండా పేదలను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు.

గతంలో డ్రా తీసి వారికి ఇల్లు కేటాయించిన వారు అధికారులు కాదా వాళ్ళు అనధికారులు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఆన్లైన్లో డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ డ్రా చేసి పట్టాలు ఉన్న వారిని విస్మరించడం సరైన కాదన్నారు. ఇప్పటికైనా న్యాయబద్ధంగా అర్హులైన పట్టాలు కలిగి ఉన్న డబుల్ బెడ్ రూములలో నివాసం ఉంటున్న పేదలకే డబుల్ బెడ్ రూమ్ పట్టాలు ఇవ్వాలని అలాగే ఇందిరమ్మ ఇళ్లలో నివాసం ఉంటున్న ఇళ్లకు జనగామ మున్సిపల్ ద్వారానే ఇంటి నెంబర్లు వేసి మౌలిక వసతులైన కరెంటు మంచినీరు సిసి రోడ్డు వంటి సౌకర్యాలు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి సుంచు విజేందర్ ఎండి అజారుద్దీన్ మూడో వార్డు కౌన్సిలర్ బూడిది జ్యోతి మూడో విడత ఇందిరమ్మ లబ్ధిదారుల అధ్యక్షులు కళ్యాణం లింగం పట్టణ కమిటీ సభ్యులు పల్లెర్ల లలిత మున్సిపల్ జయ ఎండి గౌసియా కచ గళ్ళ వెంకటేష్ మాదాసి సుధాకర్ సిలివేరు ఉపేందర్ పద్మ అందాలు కమల నాజియా రేణుక కవిత శశిరేఖ సంతోష మల్లమ్మ సౌందర్య యాదమ్మ లక్ష్మి అమ్ములు తదితరులు తదితరులు పాల్గొన్నారు.

MD AHMAD PASHA, JANGAON

MD AHMAD PASHA, JANGAON