Jangaon: నల్ల నరసింహులు విగ్రహానికి సీపీఎం ఘన నివాళి

Jangaon: జనగామ జిల్లా పాలకుర్తిలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు 33వ వర్ధంతి సందర్భంగా సీపీఎం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 5 Nov 2026 9:07 PM IST
Jangaon
X

Jangaon: నల్ల నరసింహులు విగ్రహానికి సీపీఎం ఘన నివాళి

జనగామ జిల్లా: అణగారిన ప్రజల హక్కుల సాధనకు నిలువెత్తు నిదర్శనంనల్ల నర్సింహులు అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మండల కమిటీ సభ్యుడు సోమసత్యం అన్నారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు నల్ల నరసింహులు 33వ వర్ధంతిని పురస్కరించుకొని వారి విగ్రహానికి సిపిఎం ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి భాంచన్ దొర నీ కాళ్లు మొక్కుతా అనే బానిస బతుకు వద్దని వెట్టి చేసే మట్టి మనుషులకు మనోధైర్యాన్ని నింపిన దిశాలి అని, బహుజనుల బాగు కొరకు పోరుబాట పట్టి తెలంగాణ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు పెంచిన నాయకులు అని, విప్లవాల పురిటి గడ్డ జనగామ పోరు బిడ్డ అలుపెరుగని సాయిధ పోరాట నిప్పు కణం తెలంగాణ సింహం నల్ల నరసింహులు అని, తెలంగాణ ప్రాంత ప్రజల విముక్తి కోసం పోరాటం చేసిన మహాయోధుడు అని వారన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు సోమా అశోక్ బాబు, ప్రజా సంఘాల నాయకులు గుండె వేణు, కన్నె శ్రీను, పి చంద్రశేఖర్, శివకుమార్, సత్యనారాయణ, పి లక్ష్మీనరసు, సోమన్న, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI