Jangaon: జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. సిపిఎం ఆధ్వర్యంలో రైతు పోరు!
Jangaon: జనగామ జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు.
Jangaon: జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. సిపిఎం ఆధ్వర్యంలో రైతు పోరు!
జనమ జిల్లా: కేంద్రంలోని వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని అరికట్టి త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు నినాదాలు చేస్తూ వరి కల్లాలలో నిలువ ఉన్న ధాన్యాలను వెంటనే కొనుగోలు చేపట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ.. వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు చేపట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాతావరణ మార్పుల్లో వర్షాల పట్ల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే నివారించి ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలని డిమాండ్ చేశారు.
Next Story




