Jangaon: మూడో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలి: సీపీఎం!
Jangaon: మూడో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలని సీపీఎం డిమాండ్. ఇళ్లకు నంబర్లు ఇవ్వాలని, 72 మందికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అప్పగించాలని జాన్ వెస్లీ హెచ్చరిక.
Jangaon: మూడో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయాలి: సీపీఎం!
జనగామ: జనగామ పట్టణంలో 2012-13 సంవత్సరంలో అప్పట్లో కేటాయించిన మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల స్థలాలను, అక్కడ తమ శక్తి మేరకు ఇల్లు నిర్మించుకున్న పేదల హక్కులను కాపాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జగ్గుల జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.
జనగామలో జరిగిన పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న పేదలకు ఇంటి నెంబర్లు కేటాయించాలని, అలాగే గతంలో అధికారికంగా డ్రా తీసి కేటాయించిన 72 మందికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే అప్పగించాలని కోరారు.
అధికారులు, ప్రభుత్వం గత వాగ్దానాలను విస్మరించి పేదల మధ్య కొత్త వివాదాలు సృష్టిస్తే ఊరుకోబోమని, కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు ఎండి అబ్బాస్, మోకు కనకారెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.




