Palakurthi: కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేయాలని రాస్తారోకో!

Palakurthi: జనగామ జిల్లా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో వ్యకాస, రైతుసంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో 'జైల్ భరో' ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 10 Aug 2026 10:38 PM IST
Palakurthi
X

Palakurthi: కేంద్రం నల్ల చట్టాలను రద్దు చేయాలని రాస్తారోకో!

పాలకుర్తి: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని వీటిని ప్రజా ఉద్యమాల ద్వారానే తిప్పి కొట్టగలమని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిట్యాల సోమన్న, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల సారయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సోమసత్యం, సిఐటియు మండల నాయకులు పెండ్లి భాస్కర్ అన్నారు.

సోమవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జైల్ బరో కార్యక్రమాన్ని పురస్కరించుకొని వ్యకాస సిఐటియు రైతు సంఘం ఆధ్వర్యంలో గుడివాడ చౌరస్తా నుండి ర్యాలీ తీసి అనంతరం రాజీవ్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత ప్రజలు నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో నేటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక రైతు విద్యార్థి యువజన సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు.

విత్తన చట్టం. విద్యుత్ సవరణ చట్టాలను వినికి తీసుకోవాలని డిమాండ్ చేశారు, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని విమర్శించారు, 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచే విధానాలను తీసుకురావడం ద్వారా కార్మికుల హక్కులను హరించేందుకు ప్రయత్నిస్తుందని సమ్మె చేసే హక్కు, గుర్తింపు సంఘాల రిజిస్ట్రేషన్ వంటి హక్కులను పరిమితం చేస్తున్నారని ఆరోపించారు.

ఉపాధి హామీ చట్టంలో కేంద్ర రాష్ట్రాల నిధుల వాటాను మార్చడం ద్వారా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఈ చట్టాన్ని నిర్మిరం చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు, స్వదేశీ నినాదాన్ని పక్కనపెట్టి విదేశీ సంస్థలకు అనుకూలంగా స్వేచ్ఛ వాణిజ ఒప్పందాలను చేసుకోవడం వల్ల దేశీయ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు దెబ్బతిని రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.

నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుదల నిరుద్యోగం విద్య వైద్య రంగాల ప్రైవేటు కారణంగా సామాన్య ప్రజల జీవితం మరింత దుర్భరంగా మారిందని పేర్కొన్నారు, ప్రజాస్వామ్య హక్కులను కుదించే చర్యలు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే దేశ లౌకిక ప్రజాస్వామ్య విలువలకు ముంపుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సోమ అశోక్ బాబు, రైతు సంఘం మండల కార్యదర్శి బెల్లి సంపత్, సిఐటియు నాయకులు మాసంపల్లి నాగయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కాకర్ల బాబు, ముస్కు ఇంద్రారెడ్డి, అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ అండ్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు పెంతల భిక్షం, ఏనుగతల వెంకన్న, పనికిరా భాస్కర్, అంబటి సోమయ్య, కాకర్ల పద్మ, తోటకూరి నరసయ్య, కౌడగాని మల్లేష్, కుమార్ సమ్మయ్య, లక్ష్మణ్, ఒగ్గుల కొమురయ్య, ఎడవెల్లి ఎల్లమ్మ, యాదమ్మ, గాయాల ఉపేంద్ర, గాదపాక ఎల్లమ్మ, గాదపాక యాకమ్మ, ఎడవెల్లి ఎల్లమ్మ, బాణాల వెంకన్న, సోమ నరసయ్య, గోగుల లక్ష్మి, చింత యాదమ్మ, రజిత, సుజాత, పూలమ్మ, మమత, తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story