Mahabubabad: ఎమ్మెల్యే మురళీ నాయక్‌కు వినతిపత్రం అందజేసిన స్థిత ప్రజ్ఞ
Mahabubabad: జన జాగరణ యాత్రలో పాత పెన్షన్ పునరుద్ధరించాలని టీఎస్ సీపీఎస్ యూ అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే మురళీ నాయక్‌కు వినతిపత్రం ఇచ్చారు.
Mahabubabad: ఎమ్మెల్యే మురళీ నాయక్‌కు వినతిపత్రం అందజేసిన స్థిత ప్రజ్ఞ
మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) ను రద్దు చేసి.పాత పెన్షన్ ను పునరుద్ధరించాలంటూ తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థిత ప్రజ్ఞ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకై భద్రాచలం లో చేపట్టిన జన జాగరణ యాత్ర మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఎమ్మెల్యే డాక్టర్.మురళీ నాయక్ కు ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి ఉద్యోగులు ఎంతో కృషి చేశారని ,
ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత పెన్షన్ ను పునరుద్ధరిస్తామని హామీ నిచ్చారని , దీన్ని పునరుద్ధరించక పోవడం తో రాష్ట్రం లోని 2 లక్షల 60 వేల మంది ఉద్యోగులు నష్టపోతున్నారని, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, చత్తీస్గడ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ పునరుద్ధరించారని గుర్తు చేశారు. ఈ యాత్ర 33 జిల్లాల గుండా హైదరాబాద్ చేరుకుంటుందని , అందరి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నామన్నారు.
ఆగస్ట్ 23 న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ, ఇటీవల పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కొత్త పెన్షన్ అమలు కావడం లేదని , దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని , అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించి న్యాయం చేస్తానని హామీనిచ్చారు.ఈ జన జాగరణ యాత్ర లో జిల్లా లోని ఉద్యోగులు , విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు.




