Maripeda: మరిపెడలో నిబంధనలకు విరుద్ధంగా క్రాకర్స్ దుకాణాలు

Maripeda: దీపావళి వేళ మరిపెడలో క్రాకర్స్ దుకాణాల్లో భద్రతా నిబంధనలు పాటించడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తనిఖీలు చేపట్టాలని డిమాండ్.

P PRABHAKAR, DORNAKAL
Published on: 7 Nov 2026 5:46 PM IST
Maripeda
X

Maripeda: మరిపెడలో నిబంధనలకు విరుద్ధంగా క్రాకర్స్ దుకాణాలు

మరిపెడ: దీపావళి పండుగ వేళ మరిపెడ ప్రాంతంలో క్రాకర్స్ దుకాణాల నిర్వహణపై భద్రతా నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న బాణసంచా వ్యాపారంలో కనీస భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షాపుల మధ్య నిర్ణీత దూరం, అగ్నిమాపక పరికరాలు, సురక్షిత విద్యుత్ వైరింగ్, బాణసంచా నిల్వ వంటి అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. అయితే కొన్ని దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లు అంతంతమాత్రంగానే ఉన్నాయన్న ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయి.

క్రాకర్స్ షాపులకు అనుమతులు మంజూరు చేసే ముందు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారా? అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను పరిశీలించారా? నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాతే లైసెన్సులు ఇచ్చారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అగ్నిప్రమాదాలు జరగకుండా సంబంధిత అధికారులు సమగ్రంగా తనిఖీలు నిర్వహించి భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL