Kesamudram: ప్రాణాలకు తెగించి మొసలిని పట్టుకున్న యువత

Kesamudram: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లిలో ఓ వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షమవడం కలకలం రేపింది.

A.Rajkumar, Mahabubabad
Published on: 23 Jun 2026 11:35 AM IST
Kesamudram
X

Kesamudram: ప్రాణాలకు తెగించి మొసలిని పట్టుకున్న యువత

కేసముద్రం: మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో మొసలి కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. బావిలో మొసలి సంచరిస్తున్నట్లు గమనించిన రైతులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ, మొసలిని పట్టుకునేందుకు తగిన చర్యలు చేపట్టలేదని గ్రామస్థులు ఆరోపించారు. దీంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు ధైర్యంగా ముందుకొచ్చి బావిలోకి దిగారు.

వలల సహాయంతో ఎంతో చాకచక్యంగా మొసలిని పట్టుకుని, అనంతరం దానిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ప్రాణాలకు తెగించి మొసలిని పట్టుకున్న యువకుల సాహసాన్ని గ్రామస్థులు అభినందించారు.

వ్యవసాయ బావిలో మొసలి కనిపించడంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీ శాఖ అధికారులు స్పందించిన తీరుపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేయగా, మరోవైపు మొసలిని సురక్షితంగా పట్టుకున్న యువకుల ధైర్యసాహసాలను ప్రశంసించారు.

మొసలి బావిలోకి ఎలా వచ్చిందనే విషయంపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. అలాగే పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story