Jangaon: కౌన్సిలర్లను అవమానించిన చైర్‌పర్సన్.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బాధితులు!
Jangaon: జనగామ మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి తమను చులకన చేసి దూషించారని దళిత, మైనార్టీ కౌన్సిలర్లు స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
Jangaon: కౌన్సిలర్లను అవమానించిన చైర్‌పర్సన్.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన బాధితులు!
జనగామ జిల్లా:దళిత మైనార్టీ కౌన్సిలర్ల పట్ల చైర్‌పర్సన్ కడమంచి బాలమణి అను చితంగా చులకనగా వ్యవహరిస్తున్నారని పలువురు దళిత మైనార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు ప్రజా సమస్యలపై మున్సిపల్ సమావేశంలో ప్రస్తావించగా తమను గౌరవించకుండా మీకు తలకాయలో మెదడు ఉందా మీకు బుర్ర ఉందా అంటూ అవ మానకరంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి అవమానకర వ్యాఖ్యలు వివక్షపూరిత వైఖరి ఇదే మొదటి సారి కాదని గతంలో కూడా పలుమార్లు తమ పట్ల ఇదే తరహాలో చులకనగా వ్యవహరించారని వారు పేర్కొన్నారు ప్రజల చేత ఎన్ను కోబడిన ప్రజాప్రతినిధులమైన తమను అవమానించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
చైర్‌పర్సన్ కడమంచి బాలమణి తమ పట్ల ప్రవర్తించిన తీరుపై దళిత మైనార్టీ కౌన్సిలర్లు పానుగంటి సువార్త మంజుల సాజిత్ పాతిమా సమద్ గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐకి ఫిర్యాదు చేశారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చైర్‌పర్సన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.
దళిత మైనార్టీ ప్రజాప్రతినిధులను అవమానించడం వారి ఆత్మగౌ రవాన్ని దెబ్బతీయడం సహించబోమని కౌన్సిలర్లు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై వెంటనే చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.




