Hanamkonda: రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి స్వాధీనం!
Hanamkonda: దామెరలో అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి, బైక్, నగదు స్వాధీనం చేసుకున్నారు.
Hanamkonda: రూ.1.25 కోట్ల విలువైన 251 కిలోల గంజాయి స్వాధీనం!
హనుమకొండ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా, వారి బంగారు భవిష్యత్తును కాపాడటంతో పాటు, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను విక్రయాలకు పాల్పడే వారిని నియంత్రించి గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దష్టి పెట్టడం జరిగింది.
ఇందులో భాగంగా ఈస్ట్‌జోన్ డిసిపి అంకిత్‌కుమార్ అధ్వర్యంలో దామెర పొలీసులు అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుత్ను నిందితుడుని అదుపులోకి తీసుకోని విచారణ చేయగా గంజాయి కోనుగోలు, విక్రయాలకు సంబంధించి కీలక వివరాలను వెలుగులోకి వచ్చాయి. ముదిగొండ నాగేశ్వర్ రావు, వయస్సు 55, పులుకుర్తి గ్రామం, దామెర మండలం, హన్మకొండ జిల్లా.
ఇతను సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో నిందితుడు తనకు వున్న నెట్‌వర్క్ ద్వారా ఒడిషా రాష్ట్రానికి చెందిన రమేష్ మరియు సుధాకర్ వద్ద తక్కువ ధరకు గంజాయి కోనుగోలు చేసి తెలంగాణ, మహరాష్ట్ర, కర్ణాటక, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి నిందితులు ఉర్దు, రాందాస్ శేషరావు బీరదార్ , అక్లీం, షారుఖ్ ఖాన్, షేక్ అక్బర్, నునావత్ రాజుల ద్వారా ఎక్కువ ధరకు విక్రయించినట్లుగా ప్రాధమిక విచారణలో వెల్లడైంది.
పోలీసులు పట్టుబడిన నిందితుడు ఇచ్చిన సమాచారం పోలీసులు అతని ఇంటి నుండి సుమారు భారీ మొత్తంలో సుమారు 1కోటి 25లక్షల రూపాయల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకోబడింది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో పాటు పోలీసులకు పట్టు బడిన నిందితుడు నాగ్వేశ్వర్ రావు నుండి గంజాయి కోనుగోలు చేసిన మిగితా రాష్ట్రాలకు చెందిన నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం జరిగింది.
మత్తు పదార్థాల అక్రమ రవాణాతో పాటు వినియోగంపై తెలంగాణ పోలీస్ విభాగం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడుకోవడంతో పాటు, విక్రయదారులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాము. మత్తు పదార్థాల కట్టిడికై ప్రజలు సైతం వంతు సహకారం అందించాలని ప్రధానంగా ఎవరైన గంజాయి విక్రయాలకు పాల్పడిన, వినియోగించిన స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
గంజాయి స్మగ్లర్‌ను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పరకాల ఏసిపి సతీష్ బాబు, శాయంపేట సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఆత్మకూర్ ఇన్స్‌స్పెక్టర్ సంతోష్, దామెర ఎస్.వ వీరభద్రరావు, శాయంపేట ఎస్.ఐ పరమేశ్వర్, పరకాల ఎస్.ఐ రఘుపతితో పాటు ఏఏఓ సల్మాన్ పాషా, దామెర, శాయంపేట కానిస్టేబుళ్ళను మన స్పూర్తిగా అభినందిస్తున్నాను.




