Jangaon: జనగామ పీఎస్‌లో రికార్డులు, పిటిషన్ల పరిష్కారంపై డీసీపీ సమీక్ష
Jangaon: జనగామ పోలీస్ స్టేషన్‌లో డీసీపీ రాజమహేంద్ర నాయక్ వార్షిక తనిఖీ నిర్వహించారు.
Jangaon: జనగామ పీఎస్‌లో రికార్డులు, పిటిషన్ల పరిష్కారంపై డీసీపీ సమీక్ష
Jangaon: జనగామ జిల్లా డీసీపీ జనగామ శ్రీ రాజమహేంద్ర నాయక్ ఇన్‌చార్జ్ ఏసీపీ శ్రీ భీమ్ శర్మ గారితో కలిసి జనగామ పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ నిర్వహించారు.
తనిఖీలో భాగంగా ముందుగా పోలీస్ స్టేషన్ రిసెప్షన్‌ను పరిశీలించి కొత్తగా వచ్చిన పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న పిటిషన్లు వాటి పరిష్కార స్థితిని సమీక్షించారు. అనంతరం జనరల్ డైరీ ఎఫ్‌ఐఆర్‌లు వివిధ రిజిస్టర్లు, పెండింగ్ కేసుల ఫైళ్లు మరియు ఇతర అధికారిక రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
అలాగే పోలీసు సిబ్బంది పర్సనల్ కిట్లు పరేడ్ లాఠీ డ్రిల్ క్రమశిక్షణ బీట్ పోలీసింగ్ పెట్రోలింగ్ పెట్రోకార్ నిర్వహణ స్టేషన్ పరిశుభ్రత ఆయుధాల సామగ్రి నిర్వహణ సిబ్బంది హాజరు రిజిస్టర్లు మరియు పోలీసింగ్ సేవలను సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా గౌరవ డీసీపీ శ్రీ రాజమహేంద్ర నాయక్ ప్రజలకు పోలీసింగ్ సేవలు అందించాలని సూచించారు. రిసెప్షన్‌కు వచ్చే ప్రతి పిటిషన్‌ను వెంటనే నమోదు చేసి నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే స్టేషన్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించడం పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం బీట్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడం క్రమశిక్షణతో విధులు నిర్వహించడం ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం మరియు పోలీస్ స్టేషన్‌లో అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
ఈ వార్షిక తనిఖీలో సీఐ సత్యనారాయణ రెడ్డి ఎస్‌ఐలు భరత్ రతీష్ చిన్నకేశవులు నర్సయ్య మరియు జనగామ పోలీస్ స్టేషన్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.




