Warangal: నూతన పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలి రైతు సంఘాలు!

Warangal: వరంగల్ నగరంలో ప్రత్యేకంగా పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరుతూ రైతు సంఘాల నాయకులు ఏనుమాముల మార్కెట్ చైర్ పర్సన్‌కు వినతిపత్రం అందజేశారు.

Narender, Staff Reporter  -Warangal
Published on: 28 July 2026 4:33 PM IST
Warangal
X

Warangal: నూతన పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలి రైతు సంఘాలు!

Warangal: వరంగల్ లో నూతన పండ్ల మార్కెట్ నిర్మాణం చేపట్టాలని ఈరోజు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ ఎర్ర ప్రియాంక పులి అనిల్ డైరెక్టర్ పూర్ణచందర్ గార్లకు వరంగల్ పండ్ల మార్కెట్ భూసాధన కమిటీ ఆధ్వర్యంలో జిల్లా రైతు సంఘాల నాయకులు వినతిపత్రం ఇచ్చారు.

వివిధ రాష్ట్రాల నుండి మరియు తెలంగాణ రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుండి వరంగల్ నగరానికి హోల్ సేల్ గా అమ్ముకోవడానికి రైతులు అన్ని రకాల పండ్లను తీసుకొస్తారని అయితే సరుకులను అమ్ముకోవడానికి మార్కెట్ లేనందున రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే వరంగల్ నగరానికి చుట్టూ ఉన్నటువంటి గ్రామ ప్రాంతాల్లో ఉన్న భూముల్లో 30 ఎకరాలను సేకరించి ప్రత్యేకమైన పండ్ల మార్కెట్ ఏర్పాటు చేయాలని చైర్పర్సన్ గారికి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు .

చైర్ పర్సన్ ను కలిసిన వారిలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ అఖిలభారత రైతు కూలీ సంఘం( ఏఐకేఎంఎస్) ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం( ఏఐకేఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఈసంపల్లి బాబు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చుక్క మొగిలి అఖిలభారత కిసాన్ సంఘటన్ జిల్లా అధ్యక్షులు సుధమల్ల భాస్కర్ ఏఐయుకేఎస్ అధ్యక్షులు మైదంపాని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు జక్కుల తిరుపతి నాయకులు హంసల్ రెడ్డి బండి వెంకటేశ్వర్లు బోళ్ల ఎల్లయ్య రమేష్ తదితరులు ఉన్నారు.

ఇట్లు

సోమిడ్డి శ్రీనివాస్

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story