Mulugu: ఆడిట్‌కు గైర్హాజరైన హెచ్ఎంలకు డీఈఓ సిద్ధార్థ రెడ్డి హెచ్చరిక!
Mulugu: ములుగు జిల్లా డీఈఓ ఏ. సిద్ధార్థ రెడ్డి జూలై 24న జరిగిన ఆడిట్‌కు హాజరుకాని 24 పాఠశాలల హెచ్ఎంలు, ఎంఆర్సీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
Mulugu: ఆడిట్‌కు గైర్హాజరైన హెచ్ఎంలకు డీఈఓ సిద్ధార్థ రెడ్డి హెచ్చరిక!
ములుగు: ములుగు జిల్లాలోని పాఠశాలలు, కాంప్లెక్స్లు మరియు మండల విద్యా వనరుల కేంద్రాలకు జులై 24 వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం నిర్వహించబడినటువంటి ఆడిట్ కి హాజరు కాని ప్రధానోపాధ్యాయులు మరియు సంబంధిత విభాగ అధిపతులకు శోకజ్ నోటీసులు జారీ చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి ములుగు ఏ సిద్ధార్థ రెడ్డి గారు తెలిపారు.
ఆడిట్ కి హాజరుకాని వారిలో 24 పాఠశాలలు, మూడు కాంప్లెక్స్ పాఠశాలలు, మూడు మండల విద్యా వనరుల కేంద్రాలు, ఒక కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం, రెండు పిఎం శ్రీ పాఠశాలలు ఉన్నాయని వారు తెలిపారు. షోకాజ్ నోటీసులు జారీ చేయబడిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాశాఖ అధికారులు మూడు రోజులలోగా రాతపూర్వక వివరణ ఇవ్వాలని, లేనిచో వారిపై శాఖపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని వారు తెలిపారు.




