Mahabubabad: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు.. తొలిరోజే బుక్స్ పంపిణీ!
Mahabubabad: మహబూబాబాద్ జిల్లా బి.లక్ష్మీపురంలో పాఠశాలల పునఃప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి.
Mahabubabad: కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూళ్లు.. తొలిరోజే బుక్స్ పంపిణీ!
మహబూబాబాద్: ప్రభుత్వ పాఠశాలకు మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులు, పూలు, రంగు రంగుల బెలూన్లతో అందంగా అలంకరించి మేళ తాళాల నడుమ విద్యార్థులకు గులాబీ పూలు, బెలూన్లు అందిస్తూ పాఠశాలకు స్వాగతం పలికిన సంఘటన మహబూబాబాద్ జిల్లా బి లక్ష్మీపురం గ్రామం లో చోటు చేసుకుంది.
విద్యార్థులు ఆనంధోత్సాహాల తో పాఠశాలలో అడుగుపెట్టారు. ప్రభుత్వ పాఠశాలల పునర్ ప్రారంభం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా బిలక్ష్మీపురం గ్రామం లోని ప్రభుత్వ మాధ్యమికోన్నత పాఠశాల కు మేళ తాళాలతో పాఠశాలకు చేరుకున్న విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి , పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు గులాబీ పూలు , బెలూన్లు అందించి స్వాగతం పలికారు.
అనంతరం పాఠ్య పుస్తకాలు , నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ, జిల్లా లోని 762 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను అన్నింటినీ కల్పించామని , విద్యార్థులకు నోట్ బుక్స్ , బుక్స్ ఈరోజు పంపిణీ చేస్తామని , బడిబాట కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలల ఆవశ్యకతను వివరించామని, ఈ సంవత్సరం 10 శాతం విద్యార్థులను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందిస్తూ, రాష్ట్రం లో మహబూబాబాద్ జిల్లాను ప్రథమ స్థానం లో నిలబెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు.




