Devarkadra: దేవరకద్రలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Devarkadra: దేవరకద్ర నియోజకవర్గంలో వ్యవసాయ అవసరాల నిమిత్తం రైతన్నలకు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ సామగ్రి పంపిణీ చేసిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 18 Aug 2026 7:06 PM IST
Devarkadra
X

Devarkadra: దేవరకద్రలో రైతులకు ట్రాన్స్ఫార్మర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద దేవరకద్ర మున్సిపాలిటీ & మండలం కు చెందిన రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం 40 ట్రాన్స్ఫార్మర్లు మరియు AB స్విచ్ లు, వైర్లు, పోల్స్ పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.

అనంతరం ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ..రైతుల సంక్షేమమే ధ్యేయంగా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

ప్రస్తుతం వర్షాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పలువురు రైతులు బోర్లపై ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్నారని, ఈ నేపథ్యంలో విద్యుత్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దేవరకద్ర నియోజకవర్గానికి సుమారు 800 ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరగా ప్రభుత్వం వెంటనే స్పందించి 800 ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేసిందని పేర్కొన్నారు.

ఇందులో భాగంగా దేవరకద్ర మండలానికి మొదటి విడతలో 40 ట్రాన్స్‌ఫార్మర్లను రైతులకు అందజేస్తున్నామని, మరో పది రోజుల్లో మరో 60 ట్రాన్స్‌ఫార్మర్లను అందజేస్తామని తెలియజేశారు.

ట్రాన్స్ఫార్మర్ల పంపిణీకి సంబంధించి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లను ఎప్పటికప్పుడు అందజేస్తామని పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లతో పాటు వైర్లు, ఏబీ స్విచ్ లు, పోల్స్ తదితర అవసరమైన విద్యుత్ సామగ్రిని రైతులకు అందిస్తున్నామని తెలిపారు.

ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవరకద్ర నియోజకవర్గంలో రైతుల అవసరాల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు 13 సబ్‌స్టేషన్ లకు శంకుస్థాపన చేసామని, దానికి సంబంధించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 500 ట్రాన్స్‌ఫార్మర్లను దేవరకద్ర నియోజకవర్గ రైతులకు అందజేశామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అంజిరెడ్డి, అరవింద్ కుమార్ రెడ్డి,ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు ఏడి జగన్మోహన్, ఏ ఈ శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story