Devaruppula: దేవరుప్పులలో ‘హెల్త్ మిషన్-100’: డ్వాక్రా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు!

Devaruppula: జనగామ జిల్లా దేవరుప్పులలో డ్వాక్రా మహిళలకు 'హెల్త్ మిషన్-100' కింద ఉచిత ఆరోగ్య పరీక్షలు ప్రారంభం. 30 రకాల వైద్య పరీక్షలు, ప్రతి ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డ్ పంపిణీ వివరాలు.

S MAHENDER, PALAKURTHI
Published on: 8 Jun 2026 2:28 PM IST
Devaruppula
X

Devaruppula: దేవరుప్పులలో ‘హెల్త్ మిషన్-100’: డ్వాక్రా మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు!

జనగామ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4.37లక్షల స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 46లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ప్రకటించారు. అందులో భాగంగానే దేవరుప్పుల మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్వాక్రా మహిళలకు ఉచిత ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించగా ముఖ్య అతిథిగా దేవరుప్పుల గ్రామ సర్పంచ్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ పాల్గొని మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళల సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం హెల్త్ మిషన్-100 పేరుతో 100 రోజుల ఆరోగ్య మిషను చేపట్టి 30 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తోందని,మహిళల్లో సాధారణంగా వచ్చే బీపీ,షుగర్,థైరాయిడ్,రక్తహీనత వంటి 30 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నారని,పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రతి మహిళకు క్యూఆర్ కోడ్ తో కూడిన డిజిటల్ హెల్త్ కార్డ్ రూపొందించి,ప్రభుత్వ పోర్ట్ లలో భద్రపరుస్తారని,దీనివల్ల భవిష్యత్తులో ఏ ఆసుపత్రికి వెళ్లినా పూర్తి ఆరోగ్య చరిత్ర వారికి అందుబాటులో ఉంటుందని,ఈ కార్యక్రమాన్ని డ్వాక్రా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో వైద్యాధికారి పూజ,ఉప సర్పంచ్ నర్రా కోమలత,ఏఎన్ఎంలు,ఆరోగ్య సిబ్బంది,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story