Devaruppula: దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం!

Devaruppula: దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్సై ఊర సృజన్ కుమార్.. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడబోమని స్పష్టం చేశారు.

S MAHENDER, PALAKURTHI
Published on: 17 Sept 2026 5:32 PM IST
Devaruppula
X

Devaruppula: దేవరుప్పుల పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం!

దేవరుప్పుల: జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 'ప్రజా పాలన దినోత్సవ' వేడుకలను ఘనంగా నిర్వహించారు.అందులో భాగంగానే దేవరుప్పుల మండల పోలీస్ స్టేషన్‌లో జాతీయ జెండాను స్థానిక ఎస్సై ఊర సృజన్ కుమార్ ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ సిబ్బందితో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించి,జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎస్సై సృజన్ కుమార్ మాట్లాడుతూ మండల ప్రజలందరికీ 'ప్రజా పాలనా దినోత్సవ' శుభాకాంక్షలు తెలియజేసి శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదని,ప్రజలకు చేరువగా ఉంటూ పారదర్శకమైన,వేగవంతమైన సేవలు అందించడమే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో దేవరుప్పుల పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI