Hanamkonda: పరకాల కుంకుమేశ్వర ఆలయానికి 2 కిలోల వెండి కానుకలు అందజేత!

Hanamkonda: పరకాల శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానానికి మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు చొరవతో భక్తులు రెండు కిలోల వెండి కానుకలను సమర్పించనున్నారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 14 Nov 2026 1:53 PM IST
Hanamkonda
X

Hanamkonda: పరకాల కుంకుమేశ్వర ఆలయానికి 2 కిలోల వెండి కానుకలు అందజేత!

Hanamkonda: పరకాల పట్టణ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు సుమారు రెండు కిలోల వెండి ఆభరణాలను సమర్పించనున్నారు.

సుమారు రూ.5 లక్షల విలువైన ఈ ఆభరణాలను ఈ కార్తీక మాసం నవంబర్ 16వ తేదీ సోమవారం స్వామివారికి భక్తిశ్రద్ధలతో బహుకరించనున్నారు.

పరకాల పట్టణానికి చెందిన నిప్పాని హైమావతి-సత్యనారాయణ దంపతుల కుమార్తె మేకల సంధ్యారాణి-శ్రీధర్ దంపతులు స్వామివారి అలంకరణ నిమిత్తం సుమారు ఒక కిలో వెండి ఆభరణాలను సమర్పించనున్నారు.

అదేవిధంగా ఎర్రబెల్లి మంజుల-భాస్కర్ రెడ్డి దంపతులు తమ సంకల్పాలు స్వామివారి అనుగ్రహంతో నెరవేరిన సందర్భంగా కృతజ్ఞతగా మరో కిలో వెండి ఆభరణాలను సమర్పించనున్నారు.

ఈ కార్యక్రమానికి శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు ప్రత్యేక చొరవ తీసుకొని దాతలను ప్రోత్సహించడం విశేషం.

మాజీ చైర్మెన్ గందె వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వంశానుగత అర్చకులు బ్రహ్మశ్రీ కోమాళ్ళపల్లి నాగభూషణ శర్మ, బ్రహ్మశ్రీ కోమళ్ళపల్లి సంపత్ కుమార్ శర్మ సమక్షంలో ఈ వెండి ఆభరణాలను స్వామివారికి సమర్పించనున్నారు.

ఈ సందర్భంగా దాతలు సమర్పించే రెండు కిలోల వెండి ఆభరణాలను దేవస్థానం ప్రస్తుత చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్ రావు మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి అద్దంకి నాగేశ్వర్ రావు సమక్షంలో అధికారికంగా అందజేయనున్నారు.

అనంతరం ఆలయ నిబంధనల ప్రకారం దేవస్థానం రికార్డుల్లో నమోదు చేసి స్వామివారి అలంకరణకు వినియోగించనున్నారు. దాతలు, మాజీ చైర్మన్, ప్రస్తుత చైర్మన్ సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుండటం విశేషం.

గందె వెంకటేశ్వర్లు ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ పరిసరాల అభివృద్ధి, నిత్య పూజా కార్యక్రమాలు, పండుగలు, ప్రత్యేక ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, స్వామివారి సేవకు పదవులతో సంబంధం లేదని, ఆలయ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని గందె వెంకటేశ్వర్లు తెలిపారు.

భక్తులు, దాతలు, పట్టణ ప్రజల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడమే తన సంకల్పమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, “శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయం మనందరి ఆధ్యాత్మిక కేంద్రం. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలి.

భక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వామివారి సేవలో భాగస్వాములు కావడం ఎంతో ఆనందంగా ఉంది. వెండి ఆభరణాలను సమర్పిస్తున్న దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రస్తుత చైర్మన్ కోలుగూరి రాజేశ్వర్ రావు సహకారంతో ఆలయ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని అనంతరం స్వామి వారి అన్నప్రసాదం స్వీకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL