Parkal: భవాని కుంకుమేశ్వర స్వామికి రెండు కిలోల వెండి ఆభరణాల సమర్పణ!

Parkal: పరకాల శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామివారికి భక్తులు మేకల సంధ్యారాణి - శ్రీధర్, ఎర్రబెల్లి మంజుల - భాస్కర్ రెడ్డి దంపతులు రెండు కిలోల వెండి ఆభరణాలను సమర్పించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 16 Nov 2026 11:11 AM IST
Parkal
X

Parkal: భవాని కుంకుమేశ్వర స్వామికి రెండు కిలోల వెండి ఆభరణాల సమర్పణ!

Parkal: పరకాల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పరకాల శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల వెండి కానుకల సమర్పణ . స్వామివారి దివ్య అలంకరణ నిమిత్తం మేకల సంధ్యారాణి - శ్రీధర్ దంపతులు (నిప్పాని హైమావతి - సత్యనారాయణ గార్ల కుమార్తె) ఒక కిలో వెండి ఆభరణాలను భక్తితో సమర్పించారు.

అలాగే తమ సంకల్పాలు నెరవేరినందుకు కృతజ్ఞతాభావంతో ఎర్రబెల్లి మంజుల - భాస్కర్ రెడ్డి దంపతులు ఒక కిలో వెండి ఆభరణాలను స్వామివారికి సమర్పించారు.

ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ.. కోరికలు తీర్చే దేవుడిగా కుంకుమేశ్వరుడు భక్తులకు కొంగు బంగారమై విరాజిల్లుతున్నారని, అందుకే భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తమ కోరికలు తీర్చుకుంటున్నారని తెలిపారు. కోరికలు తీరిన భక్తులు స్వామివారికి వెండి ఆభరణాలు సమర్పిస్తున్నారని అన్నారు.

దాతల కుటుంబాలకు దేవుని ఆశీస్సులు లభించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విరాళాలు ఇవ్వాలని కోరారు.అనంతరం భక్తులకు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL