Warangal: భద్రకాళి క్షేత్రంలో వైభవంగా ప్రారంభమైన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాలు

Warangal: ఓరుగల్లు మహా నగరంలో కొలువై ఉన్న చారిత్రాత్మక భద్రకాళి దేవస్థానంలో మూడు రోజుల పాటు జరిగే ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.

Narender, Staff Reporter  -Warangal
Published on: 15 Jun 2026 6:00 PM IST
Warangal
X

Warangal: భద్రకాళి క్షేత్రంలో వైభవంగా ప్రారంభమైన ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాలు

Warangal: వరంగల్ మహానగరంలో మూడు రోజులపాటు జరుపబడునున్న ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. దాతలు శ్రీ జారతి వెంకటేశ్వర్లు, గోపాల విజయకుమార్, పుప్పాల శివశంకర్, మూల రాంమూర్తి, బొమ్మగాని కృష్ణమూర్తి, పురం సతీష్ కుమార్ లు ఆలయానికి మేళతాళాలతో విచ్చేసి అమ్మవారి ఆజ్ఞ తీసుకున్నారు. అనంతరం పూర్వాంగ విధి నిర్వహించి యాగశాల ప్రవేశం చేశారు.

నర్వతోభద్ర మండల ఇత్యాది మండలాలు రచించి దేవతాహ్వానం జరిపారు. తరువాత మూలమంత్రానుష్ఠాన హోమాలు, కుటీర హెూమం జరిపి జలాదివానం చేయడంతో మొదటి రోజు కార్యక్రమం పూర్తయిందని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులలో కుడా చైర్మన్ శ్రీ ఇనుగాల వెంకట్రాం రెడ్డి, ఎస్. ఈ ఇరిగేషన్ హరివెంకటరామ ప్రసాద్ గారు తదితరులున్నారు.

ఈ ధ్వజస్తంభ ప్రతిష్ఠకు కావలసిన అన్ని ఏర్పాట్లను ఈ.ఓ శ్రీమతి రామల సునీత పర్యవేక్షించారు. ఈ రోజు కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ డా॥ బి.శివనుబ్రహ్మణ్యమ్, ధర్మకర్తలు శ్రీయుతులు తొనుపునూరి వీరన్న, కటకం రాములు, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, శ్రీమతి మోతుకూరి మయూరి రామేశ్వర్ రావు, గాండ్ల స్రవంతి, తొగరు క్రాంతికుమార్, అనంతుల శ్రీనివాస్ తదితరులతో పాటు అనేక మంది భక్తులు పాల్గొన్నారు.

Narender, Staff Reporter  -Warangal

Narender, Staff Reporter -Warangal

28 ఏళ్లుగా వరంగల్ ప్రాంతీయ సమస్యలే ఎజెండాగా, ప్రజాపక్షాన నిలుస్తూ విశ్వసనీయమైన కథనాలను మరియు ప్రత్యేక విశ్లేషణలను అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story