Hanumakonda: 10 రోజుల్లో నాలాల పూడికతీత పూర్తి కావాలి
Hanumakonda: హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ / భాజ్పాయితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.
Hanumakonda: 10 రోజుల్లో నాలాల పూడికతీత పూర్తి కావాలి
హనుమకొండ: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , హనుమకొండ జిల్లా కలెక్టర్ భాజ్పాయితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాకాలంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, తక్షణమే పనులు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నాలాల పూడికతీత పనులను వచ్చే పది రోజుల్లో పూర్తి చేసి వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అశోక్ జంక్షన్ నుంచి KU రోడ్డు వరకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, RTC బస్సులు సులభంగా రాకపోకలు సాగించేలా బస్ స్టాండ్ నుంచి కాంగ్రెస్ భవన్ రోడ్డు మీదుగా KU రోడ్డుకు అనుసంధానం చేసే ప్రతిపాదనలను పరిశీలించినట్లు తెలిపారు.
Next Story




