Jangaon: జనగామలో ముగిసిన జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపిక పోటీలు!
Jangaon: జనగామ సేజ్ హైస్కూల్లో జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపిక పోటీలు ముగిశాయి. ప్రతిభ చూపిన క్రీడాకారులు ఆగస్టు 23న జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
Jangaon: జనగామలో ముగిసిన జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపిక పోటీలు!
జనగామ: జనగామలో జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ ఎంపిక పోటీలు విజయవంతంగా ముగిశాయి జనగామలోని సేజ్ హై స్కూల్ ప్రాంగణం జిల్లా రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు పాలమాకుల కుమార్ అధ్యక్షతన నిర్వహించగా జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
అండర్ 8 వయసు నుండి అండర్ 17 వారికి ఈ పోటీలలో పాల్గొనగ తదుపరి దశవయస్సు విభాగాల వారీగా విజేతలకు బహుమతులు అందజేశారు ప్రతిభ చూపిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 23న ఆదివారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.
ఈ జిల్లా స్థాయి పోటి కొరకు మైదానం మరియు సౌకర్యాలు కల్పించిన సేజ్ హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీ వాదిరెడ్డి రోహన్ రెడ్డికి అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది ఈ కార్యక్రమంలో నీరటి నరేష్ బోట్ల సుమతి సమయ్య తదితరులు పాల్గొన్నారు.




