Ghanpur: టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖను విలీనం చేయొద్దు: టీపీ-జేఏసీ
Ghanpur: టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖను వేరే విభాగాల్లో విలీనం చేయకుండా విద్యాశాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఘన్‌పూర్‌లో టీపీ-జేఏసీ లంచ్ అవర్ ప్రొటెస్ట్ చేపట్టింది.
Ghanpur: టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖను విలీనం చేయొద్దు: టీపీ-జేఏసీ
జనగామ జిల్లా: ఘనపూర్:- టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖను ఇతర శాఖల్లో విలీనం చేయకుండా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌గానే యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ TP-JAC ఆధ్వర్యంలో చేపట్టిన లంచ్ అవర్ ప్రొటెక్షన్ కార్యక్రమం 30వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా TP-JAC ప్రతినిధులు ఆర్టీవో, ఎమ్మార్వో అధికారులను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను అందజేశారు.
టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖను శక్తి లేదా YISUలో ఎట్టి పరిస్థితుల్లోనూ విలీనం చేయకూడదని, సాంకేతిక విద్యకు ప్రత్యేకంగా ఉన్న డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్‌ను యథాతథంగా కొనసాగించాలని వారు కోరారు. ముఖ్యంగా ఈ శాఖను విద్యాశాఖ పరిధిలోనే కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సాంకేతిక విద్య ద్వారా విద్యార్థులకు నైపుణ్యాధారిత విద్య అందించడంలో పాలిటెక్నిక్ కళాశాలలు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని TP-JAC నాయకులు పేర్కొన్నారు. ఇలాంటి కీలకమైన శాఖను ఇతర విభాగాల్లో విలీనం చేయడం వల్ల సాంకేతిక విద్యా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి, టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖను ప్రత్యేక శాఖగానే కొనసాగించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత 30 రోజులుగా లంచ్ అవర్ ప్రొటెక్షన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఆర్టీవో, ఎమ్మార్వో అధికారులకు అందజేసిన వినతిపత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, సీఎం కార్యాలయానికి ఫార్వర్డ్ చేయాలని TP-JAC ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి తమ సమస్యను పరిశీలించి టెక్నికల్ ఎడ్యుకేషన్ శాఖను యథాతథంగా కొనసాగించేలా తగిన నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో TP-JAC సెంట్రల్ JAC కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, లోకల్ JAC అధ్యక్షుడు సీహెచ్ యాదయ్య, జనరల్ సెక్రటరీ అశోక్, శ్రీధర్ రెడ్డి, కిరణ్ కుమార్, రవీందర్, శ్రీకర్, అనిల్ కుమార్, రాజు, జావేద్ పాషా, నరేష్, ప్రశాంత్, రామచందర్, జితేందర్, స్వామి, రాంనర్సయ్య, సిద్ధులు దేవస్వామి తదితరులు పాల్గొన్నారు.




