Mahabubabad: డోర్నకల్‌లో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్!

Mahabubabad: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె, వరుస సెలవుల వల్ల నాలుగు రోజులు బ్యాంకులు మూతపడనుండటంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

P PRABHAKAR, DORNAKAL
Published on: 11 Sept 2026 1:22 PM IST
Mahabubabad
X

Mahabubabad: డోర్నకల్‌లో వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్!

Mahabubabad: బ్యాంకు ఉద్యోగుల బంద్‌తో శుక్రవారం బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. తమ డిమాండ్ల సాధన కోసం బ్యాంకు ఉద్యోగులు బంద్ పాటిస్తున్నారు. దీంతో ఇప్పటికే బ్యాంకు పనుల కోసం వచ్చిన ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

శనివారం రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవులు కాగా, సోమవారం వినాయక చవితి సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉండనుంది. దీంతో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ నేపథ్యంలో నగదు అవసరాలు, ఆస్పత్రి ఖర్చులు, అత్యవసర చెల్లింపులు, EMIలు చెల్లించాల్సిన వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పని విధానం అమలు చేయాలని, పెన్షన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

P PRABHAKAR, DORNAKAL

P PRABHAKAR, DORNAKAL