Jangaon: పార్టీలకతీతంగా దేవరుప్పుల మండలంలో డబుల్ బెడ్ రూమ్ ల ఎంపిక
Jangaon: దేవరుప్పుల మండలంలో పార్టీలకతీతంగా లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశామని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దావెరా అనిల్ కుమార్ తెలిపారు.
Jangaon: పార్టీలకతీతంగా దేవరుప్పుల మండలంలో డబుల్ బెడ్ రూమ్ ల ఎంపిక
జనగామ జిల్లా: దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దావెరా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. దేవరుప్పుల మండలంలో డబుల్ బెడ్రూం ఇళ్లకు సంబంధించి నిన్న జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లక్కీ డ్రా నిర్వహించి ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు.
పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా నిజమైన పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు దక్కేలా చర్యలు తీసుకోవడం పట్ల దేవరుప్పుల మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
గత పది సంవత్సరాలుగా డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి పేదలకు ఇళ్లు అందకుండా కాలయాపన చేసిందని దావెరా అనిల్ కుమార్ విమర్శించారు. అయితే ప్రస్తుతం పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గారి చొరవతో పార్టీలకతీతంగా నిజమైన అర్హులైన పేదలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి డబుల్ బెడ్రూం ఇళ్లను అందించే ప్రక్రియ చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.
నిజమైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గారికి దేవరుప్పుల మండల ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.




