Gudur: ఒకే రోడ్డుపై రెండుసార్లు బిల్లుల కాజేత.. గూడూరు మండలంలో కలకలం!

Gudur: గూడూరు మండలంలో ఒకే సీసీ రోడ్డుపై రెండుసార్లు బిల్లులు కాజేసిన అక్రమం వెలుగులోకి వచ్చింది. 8వ వార్డు మెంబర్ ఫిర్యాదు చేయడంతో విచారణ చేపడతామని డిఈ తెలిపారు.

B NARASIMHA, GUDUR
Published on: 31 Oct 2026 9:22 AM IST
Gudur
X

Gudur: ఒకే రోడ్డుపై రెండుసార్లు బిల్లుల కాజేత.. గూడూరు మండలంలో కలకలం!

Gudur: గూడూరు మండలంలోని ఓ గ్రామంలో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్న వైనంపై స్థానికంగా తీవ్ర దుమారం రేగుతోంది. అప్పటికే నిర్మించిన రోడ్డు పై మళ్లీ కొత్త రోడ్డు వేసి రికార్డులు సృష్టించి, అందినకాడికి ప్రభుత్వ నిధులను దండుకుంటున్నా బండారం బయటపడింది.

ఈ వ్యవహారంపై అదే గ్రామానికి చెందిన 8వ వార్డు మెంబర్ నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది.

గూడూరు మండల పరిధిలోని ఓ గ్రామంలో సుమారు రెండేళ్ల క్రితం ప్రభుత్వ నిధులతో సీసీ (సిమెంట్ కాంక్రీట్) రోడ్డును వేశారు. అయితే, ఆ రోడ్డు వేసి రెండేళ్లు మాత్రమే గడుస్తున్నప్పటికీ ఇటీవల అదే రోడ్డుపై మళ్లీ ఇంజనీరింగ్, పంచాయతీరాజ్ లేదా సంబందిత శాఖల ద్వారా మరోసారి కొత్తగా సిసి రోడ్డు వేసారు ..

గతంలో పూర్తై, ఆమోదం పొందిన అదే రోడ్డుపై మళ్లీ పనులు చేసినట్లుగా రికార్డులు సృష్టించి, పాత బిల్లుతో పాటు కొత్త బిల్లును కూడా కలిపి డ్రా చేసుకునేందుకు కొందరు అందినకాడికి దండుకోవడానీకి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది.

దీనికోసం ప్రత్యేకంగా తీర్మానాలను సైతం ఇప్పించుకుని నిధులు స్వాహా చేయడానికి పథకం పన్నినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

వార్డు మెంబర్ సాహసోపేత ఫిర్యాదు:

గ్రామంలో జరుగుతున్న ఈ బహిరంగ అవినీతిని, అక్రమ తంతును గమనించిన ఆ గ్రామానికి చెందిన 8వ వార్డు మెంబర్ మౌనంగా ఉండలేకపోయారు. ప్రజాధనం ఇలా అడ్డగోలుగా దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోలేమని భావించిన ఆయన, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకే రోడ్డుపై రెండుసార్లు బిల్లులు కాజేస్తున్న ఈ దందాపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ఒకే సీసీ రోడ్డుపై డబుల్ బిల్లుల డ్రా వెనుక స్థానిక నాయకులు, అధికారుల లాలూచీ ఉందని గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

8వ వార్డు మెంబర్ ఫిర్యాదుతోనైనా జిల్లా అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

విచారణ చేపడతాము-డిఇ

ఈ విషయముపై వార్డు మెంబరు తనకు తనకు చెప్పడం నిజమేనని వార్డు మెంబర్ ఫిర్యాదు మేరకు ఆ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని డి ఈ వెల్లడించారు.

B NARASIMHA, GUDUR

B NARASIMHA, GUDUR