Mahabubabad: స్కూల్ బస్సుల్లో భద్రతా నియమాలు తప్పనిసరి డీటీఓ గైడ్‌లైన్స్!

Mahabubabad: మహబూబాబాద్ వి.ఆర్.ఎన్ గార్డెన్స్ లో డీటీఓ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లకు రవాణా నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సు జరిగింది.

A.Rajkumar, Mahabubabad
Published on: 20 July 2026 11:44 PM IST
Mahabubabad
X

Mahabubabad: స్కూల్ బస్సుల్లో భద్రతా నియమాలు తప్పనిసరి డీటీఓ గైడ్‌లైన్స్!

మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా కాపాడుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శంకర్ నాయక్ ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు , కరస్పాండెంట్లకు విజ్ఞప్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని వి.ఆర్.ఎన్ గార్డెన్స్ లో పాఠశాలల డ్రైవర్లు , కరస్పాండెంట్లకు జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సందర్భంగా డ్రైవర్లను ఉద్దేశించి రవాణా శాఖ అధికారి మాట్లాడుతూ.... జిల్లా లోని ప్రతి పాఠశాల బస్సు లో ఫైర్ ఎక్విప్మెంట్ , మెడికల్ కిట్ , ఒక అటెండెంట్ , లేక విద్యార్థుల తల్లిదండ్రులు ఒకరు తప్పనిసరిగా ఉండాలని , డ్రైవర్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని , విద్యార్థులు ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ఇంటి నుంచి పాఠశాలకు , పాఠశాల నుంచి ఇంటికి చేర వేసే బాధ్యత డ్రైవర్ల పైనే ఉందని , ప్రతి డ్రైవర్ డిఫెన్స్ లో డ్రైవింగ్ చేస్తూ మూలమలుపుల వద్ద , రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాలని కోరారు.

అంతే కాకుండా ప్రతి బస్ కు పర్మిట్ , ఇన్సూరెన్స్ , టాక్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని , డ్రైవర్ 65 సంవత్సరాల లోపు వారే పని చేయాలని , డ్రైవర్లు అనారోగ్యంగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయకూడదని డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహన సదస్సులు జిల్లా లోని ప్రైవేట్ పాఠశాలల బస్ డ్రైవర్లు , ప్రిన్సిపాల్ లు , రవాణా ఇన్చార్జులు , ట్రాఫిక్ ఎస్ఐ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

A.Rajkumar, Mahabubabad

A.Rajkumar, Mahabubabad

Next Story