Jangaon: స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై దగ్ధమైన డస్టర్ కారు!

Jangaon: స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై డీజిల్ లీకేజీతో డస్టర్ కారు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

V Ravikiran, Jangaon
Published on: 12 Nov 2026 5:34 PM IST
Jangaon
X

Jangaon: స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై దగ్ధమైన డస్టర్ కారు!

Jangaon: స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ నుంచి మల్లన్న గండికి వెళ్తున్న డస్టర్ కారులో డీజిల్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లోనే కారు పూర్తిగా దగ్ధమైంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు వ్యక్తులు డస్టర్ కారులో హనుమకొండ నుంచి మల్లన్న గండికి వెళ్తుండగా స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై కారు ఇంజన్ నుంచి ఒక్కసారిగా పొగలు వెలువడ్డాయి. దీనిని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును రహదారి పక్కన నిలిపివేసి, అందులో ఉన్న ఇద్దరూ కిందకు దిగారు.

అనంతరం డీజిల్ లీకేజీ కారణంగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి చూస్తుండగానే వాహనం మొత్తం వ్యాపించాయి. మంటల తీవ్రతకు కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

డ్రైవర్ అప్రమత్తతతో ఇద్దరు వ్యక్తులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రాణనష్టం తప్పింది. కళ్లముందే కారు మంటల్లో కాలిపోవడంతో అక్కడి వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై కలకలం రేపింది.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon