Mahabubabad: యశోద హాస్పిటల్స్ ప్రెస్ మీట్.. క్యాన్సర్ లక్షణాలపై హెచ్చరిక!
Mahabubabad: మొదటి, రెండో దశల్లో క్యాన్సర్‌ను గుర్తిస్తే ఎండోస్కోపీ ద్వారా తొలగించవచ్చని యశోద ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వినోద్ రెడ్డి తెలిపారు.
Mahabubabad: యశోద హాస్పిటల్స్ ప్రెస్ మీట్.. క్యాన్సర్ లక్షణాలపై హెచ్చరిక!
Mahabubabad: క్యాన్సర్ ను 1 , 2 వ దశల లో గుర్తిస్తే ఎండోస్కోపీ ద్వారా తొలగించవచ్చని హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో క్యాన్సర్ కు అత్యాధునిక చికిత్సలు, లివర్ ట్రాన్స్ ప్లాన్ టేషన్ అందుబాటు లో ఉన్నాయని డాక్టర్.వినోద్ రెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ధరణి హాస్పటల్ లో జరిగిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ, అమెరికా,
యూరప్ దేశాల్లో 45 సంవత్సరాలు దాటిన వారికి ఎండోస్కోపీ, కొలనోస్కోపీలు చేపించుకోవడం తప్పనిసరి నిబంధన, ఈ రెండు టెస్టులు చేపిస్తే చిన్న చిన్న ట్యూమర్లను తొలి దశ లోనే గుర్తించవచ్చని, మన దేశంలో కూడా ఈ నిబంధన త్వరలో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆకలి మందగించినా , విపరీతంగా బరువు తగ్గినా, రక్తపు వాంతులు, రక్తపు విరోచనాలు అయినా, ఆకలి మందగించినా.. ఈ లక్షణాలు కనిపిస్తే క్యాన్సర్ కు అవకాశం ఉందని, వెంటనే డాక్టర్ ని సంప్రదించి, సరైన టెస్టు లు చేపించుకుని జాగ్రత్త పడాలని సూచించారు.
యశోద ఆసుపత్రిలో ఇన్సూరెన్స్ ఉన్న వారికి, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల హెల్త్ కార్డ్స్ కు ఉచిత వైద్యం అందుబాటులో ఉందన్నారు. ఈ సమావేశం లో యశోద హాస్పిటల్ కు చెందిన పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.




