Jangaon: మరణంలోనూ వీడని బంధం.. గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మృతి!

Jangaon: స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పరిధిలోని చాగల్లు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వడ్లకొండ లోకనాథం (84) మరణించిన కొద్ది గంటల్లోనే ఆయన భార్య రామక్క (75) కూడా మనోవేదనతో కన్నుమూశారు.

V Ravikiran, Jangaon
Published on: 21 Nov 2026 10:39 AM IST
Jangaon
X

Jangaon: మరణంలోనూ వీడని బంధం.. గంటల వ్యవధిలోనే భార్యాభర్తల మృతి!

Jangaon: ఏడడుగుల బంధంతో మొదలైన వారి వైవాహిక జీవితం చివరకు మరణంలోను ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయారు. భర్త మరణ వార్తను తట్టుకోలేని భార్య, ఆయన వెళ్లిన కొద్ది గంటల్లోనే మృతి చెందిన హృదయ విదారక ఘటన స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ పరిధిలోని చాగల్లు గ్రామంలో చోటుచేసుకుంది.

చాగల్లు కు చెందిన వడ్లకొండ లోకనాథం (84), వడ్లకొండ రామక్క (75) దంపతులు శుక్రవారం రాత్రి సుమారు 9:50 గంటల ప్రాంతంలో లోకనాథం కన్నుమూశారు. భర్త మరణంతో రామక్క తీవ్ర మనోవేదనకు గురై కన్నీరు మున్నేరుగా విలపించారు. n భర్త లేని లోకంలో ఉండలేను అన్నట్లుగా శనివారం తెల్లవారుజామున సుమారు 2.40 గంటల ప్రాంతంలో ఆమె కూడా ప్రాణాలు విడిచారు.

రామక్కకు గతంలో ప్రమాదం జరిగి కాలుకు రాడు వేశారు. అనంతరం ఇన్ఫెక్షన్ రావడంతో ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. భార్య పడుతున్న బాధను చూసి లోకనాథం కూడా ఎంతో మనోవేదనకు గురయ్యే వారిని స్థానికులు తెలిపారు.

జీవిత చరమాంకంలోనూ ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు ఆలోచిస్తూ గడిపిన ఆ దంపతుల జీవిత ప్రయాణం విషాదంతో ముగిసింది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు గంటల వ్యవధిలోనే కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఆ దంపతుల మరణ వార్తతో చాగల్లు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జీవితాంతం కలిసిమెలిసి సాగిన వారి ప్రయాణం చివరకు ఒకే రాత్రి ఇద్దరి మరణాలతో ముగియడం గ్రామస్తులను కలచివేసింది.

V Ravikiran, Jangaon

V Ravikiran, Jangaon