Jangaon: ఖిలాషాపురంలో అర్ధరాత్రి మోటార్ కేబుల్స్ చోరీ.. రైతుల లబోదిబో
Jangaon: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో వ్యవసాయ బావుల మోటార్ కేబుల్స్ చోరీకి గురయ్యాయి. దొంగలను పట్టుకోవాలని రైతులు పోలీసులను కోరారు.
Jangaon: ఖిలాషాపురంలో అర్ధరాత్రి మోటార్ కేబుల్స్ చోరీ.. రైతుల లబోదిబో
Jangaon: రఘునాథపల్లి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి రైతులకు చెందిన మోటార్ కేబుల్స్‌ను కోసుకెళ్లారు.
గ్రామంలోని గండి కింద ఉన్న రైతులు వంగాల కనకరాజు, వంగాల కర్ణాకర్, బక్క చేరాలు, కుమార్, బక్క మల్లయ్యలకు చెందిన బోరు మోటార్ కేబుల్స్‌ను గుర్తుతెలియని దుండగులు చోరీ చేసినట్లు రైతులు తెలిపారు.
ఈ ఘటనలో సుమారు రూ.15 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మోటార్ కేబుల్స్ చోరీ కావడంతో పంటలకు నీరందించే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దొంగలను గుర్తించి పట్టుకోవాలని రైతులు కోరారు...




