Gudur: గూడూరు మండలంలో ఉద్యోగుల బదిలీ మహోత్సవం.. ఘనంగా ఆత్మీయ వీడ్కోలు!
Gudur: మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఘనంగా అటవీ శాఖ ఉద్యోగుల వీడ్కోలు సభ.
Gudur: గూడూరు మండలంలో ఉద్యోగుల బదిలీ మహోత్సవం.. ఘనంగా ఆత్మీయ వీడ్కోలు!
మహబూబాబాద్ జిల్లా: గూడూరు మండల పరిధిలో ఇటీవల బదిలీ అయిన పలువురు అటవీ శాఖ ఉద్యోగుల "ఉద్యోగ బదిలీ మహోత్సవ ఆత్మీయ వీడ్కోలు" కార్యక్రమం అటవీ శాఖ కార్యాలయంలో అత్యంత వైభవంగా జరిగింది. తోటి ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కలిసి ఈ సన్మాన సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా సహోద్యోగులు మాట్లాడుతూ, బదిలీపై వెళ్తున్న అధికారులు, సిబ్బంది గూడూరు మండలంలో అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు. విధి నిర్వహణలో వారు చూపిన ప్రతిభ, ప్రజలకు అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.
ఘన సన్మానం:
బదిలీ అయిన అటవీ శాఖ డివిజన్ అధికారి చెంద్రశేఖర,రెంజ్ అధికారి సురేష్ లను స్థానిక నాయకులు, తోటి సిబ్బంది శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహుకరించారు. వారి భావి జీవితం, రాబోయే కొత్త బాధ్యతలు మరింత విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.
బదిలీ అయిన ఉద్యోగుల భావోద్వేగ ప్రసంగం
"గూడూరు మండల ప్రజలకు సేవ చేయడం ఒక మంచి అనుభూతిని ఇచ్చింది. ఇక్కడ తోటి సిబ్బంది, ప్రజలు అందించిన సహకారం మరువలేనిది. అని బదిలీ అయిన ఉద్యోగుల భావోద్వేగ ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, అటవీ శాఖ అధికారులు, ఇతర శాఖల సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




