Rayaparthi: రాయపర్తి రామాలయంలో ఘనంగా 'ఎంగిలిపూల బతుకమ్మ' వేడుకలు

Rayaparthi: రాయపర్తి రామాలయంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా ఆటపాటలతో సందడి చేశారు.

P ASHOK, WARDHANNAPET
Published on: 10 Oct 2026 7:10 PM IST
Rayaparthi
X

Rayaparthi: రాయపర్తి రామాలయంలో ఘనంగా 'ఎంగిలిపూల బతుకమ్మ' వేడుకలు

రాయపర్తి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు రాయపర్తి రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా మహిళలు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడింది. మహిళల ఆటపాటలతో సందడి నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని పలువురు పేర్కొన్నారు.

P ASHOK, WARDHANNAPET

P ASHOK, WARDHANNAPET