Shayampet: శాయంపేటలో హనుమాన్ విగ్రహం ముక్కలు చేయడం దుర్మార్గం..

Shayampet: హన్మకొండ శాయంపేటలో హనుమాన్ విగ్రహం ధ్వంసమైన ఘటనపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

NARENDER, WARANGAL
Published on: 20 May 2026 3:15 PM IST
Shayampet
X

Shayampet: శాయంపేటలో హనుమాన్ విగ్రహం ముక్కలు చేయడం దుర్మార్గం..

శాయంపేట: శాయంపేట లో ధ్వంసానికి గురైన హనుమాన్ ఆలయ ప్రదేశాన్ని సందర్శించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి ధర్మాన్ని కాపాడాల్సిన వారు, ప్రజల మనోభావాలకు రక్షణ కవచంగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం దుర్మార్గం అన్నారు.

హన్మకొండ పేరే ఆ హనుమంతుడి పేరు మీద ఉంటే అదే హన్మకొండలో హనుమంతుడికి అపచారం జరగడం, అత్యంత కిరాతకంగా విగ్రహాన్ని ముక్కలు చేయడం హన్మకొండకే కీడు అన్నారు. ఈ కీడు పోవాలంటే ఇక్కడ పాప పశ్చాత్తమం కోసం శాంతి హోమం నిర్వహించి ప్రభుత్వమే విగ్రహ పునః ప్రతిష్ఠాపన చేయాలి అని డిమాండ్ చేశారు. దేవాదాయధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పూర్తిగా అధర్మ షాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారన్నారు.

NARENDER, WARANGAL

NARENDER, WARANGAL

Next Story