Devaruppula: ధర్మగడ్డ తండాలో కేసీఆర్ చిత్రపటానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పాలాభిషేకం!

Devaruppula: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మగడ్డ తండాలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

S MAHENDER, PALAKURTHI
Published on: 17 Sept 2026 1:53 PM IST
Devaruppula
X

Devaruppula: ధర్మగడ్డ తండాలో కేసీఆర్ చిత్రపటానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పాలాభిషేకం!

Devaruppula: బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి హయాంలో "ఎస్టీ రిజర్వేషన్లు 6% నుంచి 10%కి పెంచి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా... " "3146 తండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన సందర్బంగా.."

"తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు " హృదయ పూర్వక, కృతజ్ఞతలు తెలుపుకుంటూ తండా గిరిజనల హక్కుల సంక్షేమం కోసం చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా ధర్మగడ్డ తండా వాసులతో కలిసి కేసీఆర్ గారి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ సందర్బంగా తండలను గ్రామ పంచాయతీ లుగా చేయటం వల్ల మేము మా పాలన మేము చేసుకుంటున్నాం.

అని నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు తెలుపగ వారికి సన్మానం చేసి ST ల కోసం కెసిఆర్ గారు చేసిన కృషి, తండలకు మిషన్ భగీరథ నీటిని తెచ్చి త్రాగు నీటి సమస్య తీర్చిన మహనీయుడు కెసిఆర్ గారు అని తండాల అభివృద్ధి ప్రధాత, కరెంట్ కష్టాలు తీర్చిన కెసిఆర్ గారికి మనం అందరం ఋణపడి ఉండాలని తెలిపిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.

ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI