Devaruppula: పెద్దమడుర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు.. కోలాటం ఆడిన ఎర్రబెల్లి
Devaruppula: జనగామ జిల్లా పెద్దమడుర్లో సద్దుల బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోలాటం ఆడారు. వేడుకల్లో కరెంట్ కోతపై కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు.
Devaruppula: పెద్దమడుర్లో సద్దుల బతుకమ్మ వేడుకలు.. కోలాటం ఆడిన ఎర్రబెల్లి
జనగామ జిల్లా: దేవరుప్పుల మండలం పెద్దమడుర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఏడో రోజున సద్దుల బతుకమ్మ నిర్వహించే ఆనవాయితీ ప్రకారం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ కోలాటం వేశారు. గ్రామ ఆడబిడ్డలకు ఆయన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
వేడుకలు జరుగుతున్న సమయంలో సుమారు 20 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మహిళలు చీకట్లోనే బతుకమ్మ ఆడాల్సి వచ్చింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వల్లే రాష్ట్రంలో మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఆడబిడ్డలకు సకాలంలో బతుకమ్మ చీరలు అందేవని, కానీ నేడు చీరల పంపిణీలో జాప్యం జరగడంతో పాటు బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు చెరువుల్లో నీళ్లు కూడా లేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




