Palakurthi: సీఎం రేవంత్ రెడ్డిపై ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ధ్వజం!
Palakurthi: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ భారీ నిరసన చేపట్టింది. ప్రజలతో పాటు దేవుళ్లనూ మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.
Palakurthi: సీఎం రేవంత్ రెడ్డిపై ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ధ్వజం!
పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు, సాక్షాత్తూ దేవుళ్ళను కూడా మోసం చేసిన కేటుగాడు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల మోసాలను నిరసిస్తూ జనగామ జిల్లా పాలకుర్తిలో బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు..
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. పాలకుర్తి చౌరస్తా నుంచి గుడివాడ చౌరస్తా వరకు పాలకుర్తి, దేవరుప్పుల, కోడకండ్ల మండలాల కార్యకర్తలు భారీ ఫ్లెక్సీలతో ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు 100 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి, ఇన్ని రోజులైనా అమలు చేయకుండా ప్రజలను రేవంత్ రెడ్డి నట్టేట ముంచారని ఎర్రబెల్లి మండిపడ్డారు.
మహిళలకు నెలకు రూ. 2,500 ఎక్కడ, రైతు భరోసా, అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఏమయ్యాయి, యువతకు ఉద్యోగాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ మాటేంటి, వృద్ధులకు రూ. 4,000 పింఛన్ హామీ ఏమైంది.
అధికారంలోకి వచ్చి మాట తప్పడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని, తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ప్రజలే రేవంత్ సర్కార్‌ను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని ఎర్రబెల్లి హెచ్చరించారు.




