Parkal: పరకాల డిగ్రీ కళాశాలలో 'సమాజంలో పోలీసుల పాత్ర'పై వ్యాసరచన పోటీలు!

Parkal: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 'సమాజంలో పోలీసుల పాత్ర' అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

M PRABHAKAR, PARAKAL
Published on: 27 Oct 2026 12:48 PM IST
Parkal
X

Parkal: పరకాల డిగ్రీ కళాశాలలో 'సమాజంలో పోలీసుల పాత్ర'పై వ్యాసరచన పోటీలు!

Parkal: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరకాలలో కెరీర్ గైడెన్స్ సెల్, పరకాల పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. 'సమాజంలో పోలీసుల పాత్ర' అనే అంశంపై ఈ పోటీలు జరిగాయి.

ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే స్పష్టమైన లక్ష్యంతో పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, చట్టాలపై అవగాహన పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. సంతోష్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్. మల్లయ్య, కెరీర్ గైడెన్స్ సెల్ విభాగాధిపతి డాక్టర్ అశోక్ అలీషా, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

M PRABHAKAR, PARAKAL

M PRABHAKAR, PARAKAL