Eravennu: ఈరవెన్ను రైతుల కన్నీరు.. ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు!

Eravennu: ఈరవెన్నులో రైతుల కష్టాలను స్వయంగా పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

S MAHENDER, PALAKURTHI
Published on: 7 Jun 2026 3:44 PM IST
Eravennu
X

Eravennu: ఈరవెన్ను రైతుల కన్నీరు.. ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు!

Eravennu: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఫోన్ చేసి తమ గోడు వెళ్ళబోసుకున్న ఈరవెన్ను గ్రామ రైతులు పండించిన ధాన్యం అమ్మడానికి పడరాని పాట్లు పడుతున్నాం అని నెలలకొద్ది ఈ ఎండలో పడి చస్తున్నాం అనిబస్తాలు కూడా సరిగా ఇవ్వట్లేదు అని లారీలు కూడా లేవని ట్రాక్టర్లలో పండిన పంటని తరలించేందుకు బస్తాకు 5 రూపాయలు వసూలు చేస్తున్నారు అని రైతులు తమ గోస వెళ్ళబుచ్చారు.

వెంటనే స్పందించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈరవెన్ను గ్రామానికి వెళ్ళి ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలించి అధికారులతో మాట్లాడి తమ సమస్యలు పరిష్కారం చూపుతానని రైతులకు భరోసా నిచ్చారు.

ఈ సందర్బంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ ఎన్నడు లేని విధంగా రైతులను ఇబ్బందులు పెట్టడం కాంగ్రెస్ పార్టీకి తగదు ప్రభుత్వం మెడలు, వంచైన,రైతుల పక్షాన ఉద్యమిస్తాం, ప్రతి గింజ కొనే వరకు పోరాడుతాంఎర్రటి ఎండలో,రైతులను చూస్తే రేవంత్ రెడ్డి కి గోస అనిపిస్తా లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోంది.

సకాలంలో రైతుబంధు ఇవ్వకపోగా.. కనీసం పండిన పంటను మద్దతు ధరకు కొనే పరిస్థితిలో కూడా లేదు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వం రైతులు 2 నెలల నుంచి పడిగాపులు కాస్తున్నామని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలి సరిగా లారీలు లేక బస్తా సంచులేక రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారు వడ్లు ఇంకా రోడ్ల మీదనే ఉన్నాయి.

ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి వడ్లు కొనుగోలు వేగవంతం చేసి రైతులని ఆదుకోవాల్సిందిగా డిమాండ్.

S MAHENDER, PALAKURTHI

S MAHENDER, PALAKURTHI

Next Story